తెలంగాణ

telangana

THEFT: పెళ్లిలో చోరీ.. కేసును చేధించిన పోలీసులు

By

Published : Jun 26, 2021, 10:13 AM IST

ఈనెల 19న హైదరాబాద్ కర్మాన్ ఘాట్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో చోరీకి గురైన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పెళ్లిలో చోరీ.. కేసును చేధించిన పోలీసులు
పెళ్లిలో చోరీ.. కేసును చేధించిన పోలీసులు

ఈ నెల 19న కర్మాన్​ ఘాట్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో జరిగిన వివాహ వేడుకల్లో చోరీ జరిగింది. ఆ కేసును పోలీసులు చేధించారు. రాఘవేందర్ రావు అతని కుటుంబ సభ్యులతో కలిసి కర్మాన్ ఘాట్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో జరుగుతున్న వివాహానికి హాజరయ్యారు. విశ్రాంతి గదిలో బ్యాగులను ఉంచి పెళ్లి మండపానికి వెళ్లారు. పెళ్లి ఐపోయాక బట్టలు మార్చుకునేందుకు గదికి వెళ్లిన రాఘవేందర్ భార్యకు అక్కడ బ్యాగు కనిపించలేదు. వెంటనే రాఘవేందర్ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడు మహబూబ్ నగర్​కి చెందిన జాజల లక్ష్మీ నరసింహ స్వామి అలియాస్ లడ్డాగా గుర్తించారు. అనంతరం లడ్డాను అరెస్ట్ చేసి అతడని వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇతని పై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యచరణపై సీఎం కేసీఆర్​ కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details