తెలంగాణ

telangana

ఆఫర్ల పేరుతో మోసపోయిన జీవిత రాజశేఖర్‌.. అసలు ఎలా?

By

Published : Nov 26, 2022, 10:08 PM IST

Jeetavarajasekhar was cheated by cyber criminals: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో సినీ ప్రముఖులు పడుతున్నారు. జియో స్మార్ట్ స్టోర్‌లో ఆఫర్ల పేరుతో రూ.1.22 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఈ మోసంతో జీవిత రాజశేఖర్‌లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Jeetavarajasekhar was cheated by cyber criminals
సైబర్‌ నేరం

Jeetavarajasekhar was cheated by cyber criminals: ప్రముఖ సినీనటులు జీవిత రాజశేఖర్‌లు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. జియో స్మార్ట్ స్టోర్‌లో ఆఫర్ల పేరుతో రూ.1.22 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఈ మోసంతో జీవిత రాజశేఖర్‌లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పదిహేను రోజుల క్రితం జీవిత రాజశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు నాగేందర్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

నిబాద్ అనే వ్యక్తి గత ఏడాది జీవిత రాజశేఖర్ ఇంటికి జియో ఫైబర్ కనెక్షన్ ఇచ్చాడని ఏసీపీ పేర్కొన్నారు. అదే వ్యక్తి పేరుతో వీరికి ఫోన్ చేసిన నాగేందర్‌ బాబు తాను జియో స్మార్ట్ స్టోర్‌లో మేనేజర్‌గా చేస్తున్నానని నమ్మించాడన్నారు. 50 శాతం వరకు ఫోన్‌లపై డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు వారికి చెప్పి, ఆఫర్‌లో ఫోన్లు వస్తున్నాయని వారిని మోసం చేశాడన్నారు. జీవిత రాజశేఖర్‌ మేనేజర్‌తో అతను ఇచ్చిన అకౌంట్‌కు రూ.1 లక్ష 22 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయించారు.

ఆ డబ్బులు పంపిన తరవాత నాగేందర్ తన ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయడంతో.. వారు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. వీరు ఇచ్చిన ఫిర్యాదుతో నాగేందర్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే గతంలో కూడా భీష్మ చిత్ర దర్శకుడికి అవార్డుల పేరుతో రూ.63 వేలు వసూలు చేసి మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడని ఏసీపీ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వాళ్లనే టార్గెట్ చేస్తూ.. నాగేందర్ బాబు మోసాలకు పాల్పడుతున్నాడని సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

నాగేందర్‌బాబు జియో స్మార్ట్‌ స్టోర్‌లో మేనేజర్‌ అని ఫోన్‌ చేశాడు. 50శాతం వరకు ఫోన్‌లపై డిస్కౌంట్‌ ఇస్తున్నామన్నాడు. నిజమే అని నమ్మి అతని అకౌంట్‌కు రూ.1లక్షా 22 వేలను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. తరవాత అతను ఫోన్‌ ఆఫ్‌ చేయడంతో వచ్చి ఫిర్యాదు చేశారు. అలాగే ఇంకా కొందరు సినిమా వాళ్లను ఇలానే మోసం చేశాడు.-కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌క్రైం

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడిన జీవితరాజశేఖర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details