తెలంగాణ

telangana

కాళ్లు, చేతులు కట్టేసి రూ.30 వేలు అపహరణ

By

Published : Aug 14, 2022, 6:45 AM IST

ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి అతని వద్ద ఉన్న రూ.30 వేలు అపహరించిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిజామాబాద్‌
నిజామాబాద్‌

ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి అతని వద్ద ఉన్న రూ.30 వేలు అపహరించిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట ఠాణా పరిధిలోని మల్కాపూర్‌ శివారులో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ నరహరి వెల్లడించారు. మహారాష్ట్రలోని కొరేగాంకు చెందిన అమిత్‌పాటిల్‌(19) బెంగళూరులోని ఓ దాబాలో పనిచేస్తున్నాడని చెప్పారు. రాఖీ పండగకు ఇంటికి వెళ్లే క్రమంలో శనివారం నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చాడని సీఐ తెలిపారు.

స్టేషన్‌ బయట గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తమ వ్యాన్‌లో మహారాష్ట్ర తీసుకెళతామని చెప్పడంతో వాహనంలో ఎక్కాడని సీఐ నరహరి తెలిపారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత మత్తు పదార్థం కలిపిన మిఠాయి తినిపించడంతో అమిత్‌ స్పృహ తప్పాడని చెప్పారు. అతని వద్ద ఉన్న రూ.30 వేలు తీసుకుని, కాళ్లు, చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి మల్కాపూర్‌ శివారులోని ఓ వెంచర్‌ వద్ద పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటానాస్థలానికి చేరుకొని ఆ యువకుడిని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details