తెలంగాణ

telangana

FIRE ACCIDENT: షాపింగ్​మాల్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

By

Published : Aug 18, 2021, 5:38 AM IST

Updated : Aug 18, 2021, 6:10 AM IST

huge fire accident in shopping mall at korutla
huge fire accident in shopping mall at korutla ()

తెల్లవారు జామున కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఆనంద్​ షాపింగ్​ మాల్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే.. నాలుగు ఆంతస్తులకు మంటలు వ్యాపించాయి. రెండు గంటలకుపైగా రెండు ఫైర్​ ఇంజిన్​ల సహాయంతో శ్రమించి మంటలను ఆర్పారు.

కోరుట్లలోని షాపింగ్​మాల్​లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఆనంద్ షాపింగ్ మాల్ అగ్నిప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి దుకాణ యజమానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని... అగ్ని మాపక అధికారులకు సమాచారం అందించారు.

అగ్నిమాపక వాహనం వచ్చేసరికి కింది అంతస్తు పూర్తిగా పూర్తిగా కాలిపోయింది. చూస్తుండగానే నాలుగు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పినా ఫలితం లేకుండా పోయింది. మంటలు భారీగా ఎగసిపడడంతో వాతావరణంతా దట్టమైన పొగతో నిండిపోయింది. స్థానికులంతా తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఆస్తి నష్టం భారీగా జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

Gandhi Hospital Rape: గాంధీ ఘటనపై ముమ్మర దర్యాప్తు.. బాధితురాలి ఆచూకీ కోసం గాలింపు

Last Updated :Aug 18, 2021, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details