తెలంగాణ

telangana

Hawala Cash Seized at Jubilee Hills : జూబ్లీహిల్స్ పరిధిలో రూ.90 లక్షలు పట్టివేత

By

Published : Oct 31, 2022, 11:55 AM IST

Updated : Oct 31, 2022, 4:44 PM IST

Hawala Cash Seized at Jubilee Hills : మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో కారులో తరలిస్తున్న రూ.90 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Hawala Cash Seized at Jubilee Hills
Hawala Cash Seized at Jubilee Hills

Hawala Cash Seized at Jubilee Hills : మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎలాగైన మునుగోడు పీఠాన్ని దక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నట్లు సమాచారం.

కారులో ఉన్న వ్యక్తిని కడారి శ్రీనివాస్‌గా గుర్తించారు. ఆయన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్‌కు డ్రైవర్‌గా తేల్చారు. నగదును జూబ్లీహిల్స్‌లోని త్రిపుర కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కారు, నగదును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.

Hawala Cash Seized at Jubilee Hills

మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నంబర్ 71లో ఓ కారులో రూ.90 లక్షల నగదు తరలిస్తుండగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Last Updated : Oct 31, 2022, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details