తెలంగాణ

telangana

రోడ్డుప్రమాదంలో తాత, మనుమరాలు దుర్మరణం

By

Published : May 10, 2021, 4:19 PM IST

సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత మనుమరాలు దుర్మరణం చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా లక్ష్మీదేవి పల్లికి చెందిన నాగర్తి నర్సారెడ్డి, అనన్యగా పోలీసులు గుర్తించారు.

siddipet accident
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదంలో తాత మనుమరాలు మృతి

రహదారి ప్రమాదంలో తాత, మనుమరాలు దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం అహ్మదీపూర్​ చౌరస్తాలో జరిగింది.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లక్ష్మీదేవి పల్లికి చెందిన నాగర్తి నర్సారెడ్డి.. సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్​లోని తన కుమార్తె వద్దకు ఆదివారం సాయంత్రం వచ్చాడు. రాత్రి అక్కడే ఉండి.. సోమవారం ఉదయం తన మనుమరాలు అనన్యను తీసుకొని ద్విచక్రవాహనంపై కామారెడ్డి జిల్లా బయలుదేరాడు.

అహ్మదీపూర్​ గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలపాలైన అనన్యను అంబులెన్స్​లో గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనన్య మరణించింది.

ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీచూడండి:ఒకరికి తెలియకుండా ఒకరు.. ఒకే ఇంట ముగ్గురు

ABOUT THE AUTHOR

...view details