తెలంగాణ

telangana

రైల్​లో రెండు కోట్ల బంగారం స్మగ్లింగ్​.. సినిమా స్టైల్లో పట్టుకున్న పోలీసులు

By

Published : Nov 4, 2021, 7:50 PM IST

రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం (gold seized) చేసుకున్నారు.

gold-seized-on-yeshwantpur-howrah-express
gold-seized-on-yeshwantpur-howrah-express

ఇప్పటి వరకు విమానాశ్రయాల్లోనే ఎక్కువగా అక్రమ బంగారం పట్టుబడుతోంది. కానీ, తాజాగా స్మగ్లర్లు రైళ్లలో కూడా బంగారం తరలిస్తున్నారు. రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రివెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. యశ్వంత్‌పుర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌(Yeshwantpur- Howrah Express)లో బంగారాన్ని తరలిస్తున్నాడన్న పక్కా సమాచారంతో.. ఏపీలోని విశాఖ రైల్వే స్టేషన్​లో బుధవారం మధ్యాహ్నం అధికారులు మాటువేశారు.

రైలు రాగానే.. అందులోకి ప్రవేశించి.. నిందితుడిని తనిఖీ చేశారు. అతడి వద్ద ఏకంగా.. రూ.1.91 కోట్లు విలువ చేసే 3.89 కిలోల బంగారం బయటపడింది. నిందితుడు కోల్‌కతా నుంచి ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చి.. కోల్​కతాలో వివిధ రకాల ఆభరణాలుగా తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు చెప్పారు. నిందితుడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు డీఆర్ఐ(DRI) అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:పంజాగుట్టలో నాలుగేళ్ల బాలిక మృతదేహం... మరణమా? లేక హత్యా?

ABOUT THE AUTHOR

...view details