తెలంగాణ

telangana

pocso: ప్రేమ పేరుతో మైనర్​ను గర్భవతిని చేసిన యువకుడు.. ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక

By

Published : May 31, 2021, 9:26 AM IST

మహబూబాబాద్ జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు యత్నించింది.

MINAR PREGNANT
ప్రేమ పేరుతో మైనర్​ను గర్భవతిని చేసిన యువకుడు

మహబూబాబాద్ జిల్లాలో బాలికను అత్యాచారం... హత్య చేసి 24 గంటలు గడవకముందే... మరో మైనర్​ను గర్భవతిని చేసి మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. జిల్లాకేంద్రం శివారులోని బాబు నాయక్ తండాలో ప్రేమ పేరుతో మోసపోయిన బాలిక ఆత్మహత్యకు యత్నించింది. అదే తండాకు చెందిన దాదా అనే యువకుడు నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి గర్భవతిని చేసి మోసం చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

బాలిక నిలదీయడంతో పెద్దమనుషుల ముందు పంచాయితీ పెట్టాలని చెప్పి 3 రోజులుగా తిప్పిస్తున్నాడని వాపోయారు. మనస్తాపానికి గురైన బాలిక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:CM KCR: వద్దనుకున్నా లాక్​డౌన్​ తప్పడం లేదు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details