తెలంగాణ

telangana

గ్యాస్​ సిలిండర్ల లారీ బోల్తా... డ్రైవర్​కు స్వల్ప గాయాలు

By

Published : Mar 24, 2021, 1:25 PM IST

ముందు వెళ్తున్న కంటైనర్​ను తప్పించబోయి... గ్యాస్​ సిలిండర్ల లారీ బోల్తాపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా టేక్రియాల్​ శివారులోని జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్పగాయాలయ్యాయి. సిలిండర్లు బయటపడకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది.

Gas cylinder truck overturns and minor injuries to driver
Gas cylinder truck overturns and minor injuries to driver

కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ముందు వెళ్తున్న కంటైనర్​ను తప్పించబోయి... అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. సిలిండర్​లు రోడ్డుపై పడకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్​కు స్వల్ప గాయలయ్యాయి.

హైదరాబాద్ నుంచి గాంధారి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన డ్రైవర్​ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:శంషాబాద్​లో రూ.1.3 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details