తెలంగాణ

telangana

Maoist's surrenders: అడవిని వదిలి ఇళ్లకు చేరుతున్న మావోయిస్టులు

By

Published : Sep 7, 2021, 12:22 PM IST

Five Maoists surrender to police

ఒక్కోక్కరుగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కారణాలు ఏమైనా పోలీసులకు లొంగిపోతున్నారు. ఛత్తీస్​ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరిలో ఇద్దరు రివార్డెడ్ మావోయిస్టులు ఉన్నారు.

దంతెవాడ ఎస్పీ మరియు సీఆర్​పీఎఫ్ డీఐజీ ఎదుట ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పోజ్జా సోడీ డీకేఎంఎస్ అధ్యక్షుడితో పాటు మాసా మిలీశియా కమాండర్ ఉన్నారు. వీరి ఒక్కొక్కరిపైన లక్ష రూపాయల రివార్డ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయినందున ఆ రివార్డు వారికే ఇవ్వనున్నారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు

ఆరోగ్యం సహకరించకపోవడం, ఇతర సమస్యలతో అడవుల్లో ఉండలేక లొంగిపోతున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క దంతెవాడ జిల్లాలోనే 115 మంది రివార్డెడ్ మావోయిస్టులతో కలిపి మొత్తం 426 మంది లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

covid precautions : మీ పిల్లలను బడికి పంపుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details