తెలంగాణ

telangana

Fire In Atm: ఏటీఎంలో చెలరేగిన మంటలు.. ఏం జరిగింది?

By

Published : Oct 13, 2021, 10:43 AM IST

Fire In Atm, axis bank atm fire

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ఏటీఎంలో మంటలు(Fire In Atm) చెలరేగాయి. అర్ధరాత్రివేళ ఎగిసిపడిన మంటలను చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో దగ్ధం చేశారా? మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యాక్సిక్‌బ్యాంక్‌ ఏటీఎంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బొంబాయిలోని యాక్సిస్ బ్యాంకు కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ పట్టణ పోలీసులకు ఆగంతుకులు ఏటీఎంను దగ్గం చేశారని సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆగంతకులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో దగ్ధం చేశారా? మరేదైనా కారణమా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఏటీఎంలో చెలరేగిన మంటలు

ఇదీ చదవండి:Cyber crime: సైబర్‌ మోసాలకూ స్పెషల్ కోచింగ్‌ సెంటర్లు.. పట్టణాల్లో బహిరంగంగానే...

ABOUT THE AUTHOR

...view details