తెలంగాణ

telangana

fire accident in vijayawada: షెడ్డులో చెలరేగిన మంటలు.. మూడు లారీలు దగ్ధం

By

Published : Jun 23, 2022, 7:57 PM IST

fire accident in vijayawada: ఏపీలోని విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీలకు బాడీ బిల్డింగ్​ చేసే షెడ్డులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ఘటనలో మూడు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

fire accident
fire accident

Fire Accident in Vijayawada: ఏపీలోని విజయవాడ ఆటోనగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మూడు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసు స్టేషన్​రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం పక్కన లారీ బాడీ బిల్డింగ్ చేసే షెడ్డులో ఈ ప్రమాదం జరిగింది. లారీకి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రమాదంలో పక్కనున్న మరో రెండు లారీలకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details