తెలంగాణ

telangana

FIRE ACCIDENT: ఫ్లైవుడ్ దుకాణంలో అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం

By

Published : Aug 4, 2021, 10:52 AM IST

హైదరాబాద్ మంగళహాట్ పీఎస్ పరిధిలోని ఓ ఫ్లైవుడ్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అందులో పనిచేస్తున్న కార్మికులు వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

fire-accident-in-mangalhat-flywood-shop
ఫ్లైవుడ్ దుకాణంలో అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం

హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాత ప్రకాష్ థియేటర్ ప్రాంతంలో నెలకొల్పిన ఫ్లైవుడ్ దుకాణంలో షాట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో పనిచేసే కార్మికులను వెంటనే అప్రమత్తమవ్వడంతో... ప్రాణనష్టం తప్పింది.

విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది... గౌలిగూడ నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటపాటు శ్రమించి ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. ఫ్లైవుడ్, రెడీ మేడ్ డోర్స్ కావటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా లక్షల్లో ఆస్తి నష్టం వాటిలినట్లు యజమాని తెలిపారు.

ఇదీ చూడండి:EAMCET EXAM : కొవిడ్ నిబంధనల్లో ఎంసెట్ పరీక్ష ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details