తెలంగాణ

telangana

fire accident: ఫార్మా పరిశ్రమ గోదాంలో అగ్ని ప్రమాదం

By

Published : Aug 18, 2021, 8:37 PM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లిలో అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఫార్మా పరిశ్రమ గోదాంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

fire accident
fire accident

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలోని లీ పరిశ్రమకు చెందిన రసాయన గోదాంలో ఈ ప్రమాదం (fire accident) జరిగింది. రసాయనాలు మండి అగ్నికీలలు ఎగిసిపడటంతో పాటు భారీగా పొగ అలుముకుంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమకు చెందిన అగ్నిమాపక యంత్రం, నీటి ట్యాంకర్లు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. గోదాం కావడంతో ఉద్యోగులు పరిమితంగా ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఆస్తి నష్టమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఫార్మా పరిశ్రమ గోదాంలో అగ్ని ప్రమాదం

ఇదీ చూడండి:Lady Cheater: మాయలే(లా)డి వలపు వలలో చిక్కి సూసైడ్ యత్నం

ABOUT THE AUTHOR

...view details