తెలంగాణ

telangana

16 నెలల పసికందుపై తండ్రి హత్యాచారం... సహకరించిన భార్య

By

Published : Jan 7, 2022, 7:41 PM IST

Updated : Jan 8, 2022, 6:48 AM IST

Father murdered daughter: కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు వావివరుసలు మరిచిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నాడు. ఆడపిల్లలకు బయటే కాదు.. ఇంట్లో కన్న వాళ్ల మధ్యే రక్షణ లేదని ఇటీవల జరిగిన పలు అమానవీయ ఘటనల ద్వారా నిరూపిస్తున్నారు. కానీ కొసమెరుపేమిటంటే ఇలాంటి నీచ తండ్రిని నిలదీయాల్సిన కన్న తల్లే.. భర్త చేసిన తప్పును సమర్థిస్తూ ఆ పాపంలో పాలు పంచుకోవడం. ఈ దుర్మార్గపు తల్లిదండ్రులు పోలీసులకు పట్టుబడటంతో ఈ దారుణం వెలుగుచూసింది.

daughter murder
చిన్నారి హత్య

Father murdered daughter: ఆ పాప వయసు 16 నెలలు. ఈ నెల 3 న ఇంట్లో ఆడుకుంటున్న తన వద్దకు కన్న తండ్రి వస్తుంటే తనను ఎత్తుకుని లాలించడానికి అనుకుంది. కానీ అతని కళ్లలో కామాన్ని గుర్తించలేకపోయింది. సున్నితంగా తనను దగ్గరకు తీసుకోవాల్సిన నాన్న చేతులు.. తన ఒంటిపై మొరటుగా ప్రవర్తిస్తుంటే హతాశురాలైంది. ప్రతిఘటించలేని వయసు.. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ చిన్నారి.. తన తండ్రి కీచకత్వానికి బలైపోయింది. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడి.. అనంతరం గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు ఆ దుర్మార్గపు తండ్రి. విషయమంతా తెలిసిన ఆ చిన్నారి తల్లి.. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన భర్తపై ఎదురుతిరగకుండా.. భర్తకు సహకరించి గుట్టుచప్పుడు కాకుండా తమ సొంత గ్రామంలో పాతిపెట్టాలని నిర్ణయించింది. భాగ్యనగరంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకోగా.. చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు తమ సొంత గ్రామానికి రైలులో వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.

కదలికలపై అనుమానం

చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు తమ సొంత గ్రామానికి వెళ్లేందుకు సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి గుజరాత్​ వెళ్లే రాజ్​కోట్​ బౌండ్​ ఎక్స్​ప్రెస్​ ఎక్కారు. రైలులో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికులు వారి కదలికల పట్ల అనుమానం వ్యక్తం చేశారు. పాపలో ఎంతసేపైనా చలనం లేకపోయేసరికి వారిలో సందేహం కలిగింది. అప్పటికే ట్రైన్ మహారాష్ట్రకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు టీసీ, సోలాపూర్ రైల్వే​ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు సమీప స్టేషన్​కు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు

తల్లిదండ్రుల వద్ద నుంచి చిన్నారిని తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సోలాపూర్​ రైల్వే అదనపు ఎస్పీ గణేశ్​ షిండే తెలిపారు. వైద్య పరీక్షల్లో పాపపై లైంగికంగా దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధరించారు. గుట్టు చప్పుడు కాకుండా పాప మృతదేహాన్ని స్వగ్రామంలో పాతిపెట్టడానికే తీసుకెళ్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని షిండే వెల్లడించారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య.. తీరా పోస్టుమార్టంలో చూస్తే!

Last Updated : Jan 8, 2022, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details