తెలంగాణ

telangana

భార్య కోసం భర్త బలవన్మరణం.. కుమార్తెతో సహా..!

By

Published : Apr 10, 2021, 8:56 PM IST

భార్య మెడలో తాళి కట్టినప్పుడు మాటిచ్చాడు.. జన్మంతా నీతోడు ఉంటానని. నీకు కష్టం వస్తే ముందుంటానని.. తమ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి అనుకున్నాడు. కానీ భార్యకు వచ్చిన జబ్బుతో మానసికంగా కుంగిపోయాడు. ఓ వైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు ఇంట్లో పరిస్థితులతో తన కుమార్తెతో పాటు జీవితాన్ని ముగించాడు.

husbnad suicide for wife in ap
ఏపీలోని విజయవాడ శ్రీనగర్ కాలనీలో కుమార్తెతో సహా ఆత్మహత్య

ఏపీలోని విజయవాడ శ్రీనగర్ కాలనీలో నివాసముండేవారు జగాని రవి-భరణి దంపతులు. రవి గతంలో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేసేవాడు. లాక్​డౌన్ సమయంలో జాబ్ మానేసి ఇంటికి వచ్చాడు. రవి(40)కి భార్య అంటే పంచప్రాణాలు. వాళ్ల ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె పుట్టింది. ఆమెకు పదేళ్లు. హాయిగా సాగిపోతున్న ఆ చిన్న కుటుంబంలో చీకటి రోజులు వచ్చాయి. రవి భార్య అనారోగ్యానికి గురైంది.

ఆమెకు కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని తెలిసి అల్లాడిపోయాడు. ఎన్నో ఆసుపత్రుల చుట్టు తిరిగాడు. భార్యకు ఎలాగైనా నయం చేయించాలని అనుకున్నాడు. కానీ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. మానసికంగా కుంగిపోయిన రవి ఓ చేదు నిర్ణయం తీసుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తెతో సహా తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన అవయవాలను భార్యకు దానం చేయాలని సూసైడ్​ నోట్​ రాశాడు. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని విజయవాడ శ్రీనగర్ కాలనీలో కుమార్తెతో సహా ఆత్మహత్య

ఇదీ చూడండి:ఫోన్​ కాజేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కాడు

ABOUT THE AUTHOR

...view details