తెలంగాణ

telangana

FARMER SUICIDE ATTEMPT: భూమిని లాక్కున్నారంటూ రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : May 9, 2022, 4:20 PM IST

రైతు చిన్న చిన్నయ్య

FARMER SUICIDE ATTEMPT: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కిరోసిన్ పోసుకుంటుండగా గమనించిన పోలీసులు అతన్ని నిలువరించారు.

FARMER SUICIDE ATTEMPT: నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్ పల్లి మండలం అర్గులకు చెందిన చిన్న చిన్నయ్య అనే రైతు కలెక్టరేట్​లో నిర్వహిస్తున్న ప్రజావాణికి కిరోసిన్ డబ్బాతో వచ్చాడు. తన మీద పోసుకునేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

భూమిని 20ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాను. మధుశేఖర్, పెద్దోళ్ల గంగారెడ్డి అనే వ్యక్తులు కబ్జా చేశారని అతను ఆరోపించాడు. తన భూమి తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశాడు.

"నా భూమికి 2001లో పట్టా ఇచ్చారు. 20 సంవత్సరాలుగా పట్టా నా పేరు మీదనే ఉంది. మధుశేఖర్, పెద్దోళ్ల గంగారెడ్డి అనే వ్యక్తులు భూమిని కబ్జా చేశారు. అంతే కాకుండా నన్ను చంపడానికి ప్రయత్నించారు." -చిన్న చిన్నయ్య బాధితుడు

ఇదీ చదవండి:చావులోనూ వీడని 'బంధం'.. తమ్ముడి మృతదేహాన్ని చూసి అన్నకు గుండెపోటు

నమ్మించి లక్షలు చోరీ.. చనిపోయినట్లు డ్రామా.. 9 నెలల తర్వాత సీన్​ రివర్స్!

ABOUT THE AUTHOR

...view details