తెలంగాణ

telangana

నిజామాబాద్‌లో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య

By

Published : Aug 21, 2022, 12:50 PM IST

Updated : Aug 21, 2022, 3:31 PM IST

suicide
suicide ()

12:48 August 21

ఇద్దరు పిల్లలు సహా దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య

family suiside in nizamabad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. నగరంలోని ఒక హోటల్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ కు చెందిన కొత్తకోట సూర్యప్రకాశ్ అనే వ్యక్తి... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలు ప్రత్యూష, అద్వైత్​లతో... 15 రోజులుగా నిజామాబాద్​లోని కపిల హోటల్​లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ నలుగురు హోటల్ గదిలో విగతజీవులుగా కనిపించారు.

భార్య, పిల్లలు పురుగుల మందు తాగి చనిపోగా.... సూర్యప్రకాశ్ ఉరివేసుకుని చనిపోయాడు. మొదట భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించిన సూర్యప్రకాశ్... అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆదిలాబాద్​కి చెందిన సూర్య ప్రకాష్ కొన్నేళ్లుగా హైదరాబాద్​లో స్థిరపడ్డారు. 15 రోజుల కింద నిజామాబాద్​కు వచ్చి కపిల హోటల్​లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు.

వ్యాపారంలో నష్టాలు, ఆప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తనను డబ్బుల కోసం వేధించిన ముగ్గురి పేర్లను రాసినట్టు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన నష్టాలు, పెట్టుబడులు పెట్టిన వారి నుంచి డబ్బులు కోసం ఒత్తిడి కారణంగా చనిపోతున్నట్టు సూసైడ్ నోట్​లో పేర్కొన్నారని పోలీసులు చెబుతున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని ఏసీపీ వేంకటేశ్వర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నలుగురు కుటుంబసభ్యులు నిన్న రాత్రి హోటల్​లో ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యప్రకాశ్ సూసైడ్ నోట్ రాయటం జరిగింది. రియల్ ఎస్టేట్​ బిజినెస్​లో భాగస్వాములు, అప్పు ఇచ్చిన వారు వేధించడం వల్ల వారికి కొంత ప్రాపర్టీలు రాయించి ఇవ్వడం జరిగింది. అయినా కూడా వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్​ నోట్​లో రాశాడు. దీని ఆధారంగా దర్యాప్తు జరుపుతాం. సూసైడ్​ నోట్​లోని వారి గురించి విచారణ జరుపుతాం- వేంకటేశ్వర్, ఏసీపీ నిజామాబాద్

ఇవీ చదవండి:

నగరంలో మరోసారి ఫ్లెక్సీ వార్‌, అమిత్​షా రాక ముందు కాక

మద్యం స్కాంలో సిసోదియాకు లుక్​ఔట్​ నోటీసులు, సవాల్​ విసిరిన మంత్రి

Last Updated :Aug 21, 2022, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details