నగరంలో మరోసారి ఫ్లెక్సీ వార్‌, అమిత్​షా రాక ముందు కాక

author img

By

Published : Aug 21, 2022, 1:08 PM IST

Updated : Aug 21, 2022, 2:07 PM IST

FLEXI WAR

FLEXI WAR రాష్ట్రంలో అమిత్​షా పర్యటన, మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్​లో తెరాస వర్సెస్ భాజపా అన్నట్లు నడుస్తోంది. ఇరుపార్టీలు హోర్డింగులు, పోస్టర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ రెచ్చగొట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని పలుచోట్ల ఒకవైపు అమిత్​షాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువగా, మరోవైపు కేసీఆర్​కు మద్దతుగా అన్​బ్రేకబుల్ తెలంగాణ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీడియోలు ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారాయి.

FLEXI WAR నగరంలో మరోసారి ఫ్లెక్సీల కలకలం రేపుతోంది. నేడు రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన, మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా నగరంలోని పలుచోట్ల 'తడిపార్ కౌన్ హై' అనే హ్యాష్ ట్యాగ్​తో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వెనక్కి తిరిగి పారిపోతున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? అంటూ వెలసిన ఈ వ్యంగ్య పోస్టర్లపై బైబై మోదీ అంటూ ఉండటం గమనార్హం. బేగంపేట, సికింద్రాబాద్​ మార్గాల్లో వెలసిన ఈ పోస్టర్లు ఇప్పుడు హాట్ టాఫిక్​గా మారాయి.

నగరంలో మరోసారి ఫ్లెక్సీ వార్‌, అమిత్​షా రాక ముందు కాక

మరోవైపు 'అన్​ బ్రేకబుల్ తెలంగాణ', కేసీఆర్ పేరిట రూపొందించిన వీడియోలు... సామాజిక మధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. వైఎస్​ఆర్ పేరిట ఆ వీడియోలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌కే గర్వకారణంగా చెబుతున్న తీగలవంతెన, టీ-హబ్, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన కమాండ్‌ కంట్రోల్ కేంద్రం సహా.. భారీగా ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్లెక్సీలు, కటౌట్‌ వద్ద ఓ వ్యక్తి నిల్చొని అన్‌బ్రేకబుల్ తెలంగాణ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న వీడియోలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి.

అన్‌బ్రేకబుల్ తెలంగాణ, కేసీఆర్‌ పేరిట రూపొందించిన వీడియోలు

ఇవీ చదవండి:

Last Updated :Aug 21, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.