తెలంగాణ

telangana

'రాత్రి అయింది.. ఇంటికి పంపించమంటే చితకబాదారు'

By

Published : Apr 29, 2022, 11:56 AM IST

Updated : Apr 29, 2022, 12:04 PM IST

D.Hirehal SI : ఇరుగు పొరుగు వివాదంలో నెల రోజుల క్రితం కోర్టులో ఫిర్యాదు చేసిన తమను తాజాగా స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ‘రాత్రి అయ్యింది ఇంటికి పంపించండి’ అన్న పాపానికి చితకబాదారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

D.Hirehal SI
D.Hirehal SI

allegations on D.Hirehal SI : ఓ కేసు విషయంలో పోలీసుస్టేషన్​కు పిలిపించి డి హిరేహాల్‌ ఎస్సై రామకృష్ణారెడ్డి.. తమ తండ్రిని చితకబాదారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇరుగు పొరుగు వివాదంలో నెల రోజుల క్రితం కోర్టులో ఫిర్యాదు చేయగా.. తాజాగా తమను పోలీస్​స్టేషన్​కు పిలిపించి... రాత్రి అయినా ఇంటికి పంపించలేదన్నారు. ఇదే విషయాన్ని అడిగితే.. చితకబాదారన్నారు. పోలీసులు దాడిలో గాయపడ్డ బాధితుడు హేమంత్‌ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని మురడి గ్రామానికి చెందిన హేమంత్‌కు కుమారుడు మంజునాథ్‌, కుమార్తె మీనాక్షి ఉన్నారు. మంజునాథ్ భార్య కుటుంబసభ్యులతో నెల కిందట గొడవ జరగ్గా.. డి హిరేహాల్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై పోలీసులు హేమంత్ కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిపించారు. చీకటిపడటంతో భార్య, కుమార్తెను ఇంటికి పంపించాలని తమ తండ్రి కోరగ్గా.. ఆగ్రహించిన ఎస్పై రామకృష్ణారెడ్డి లాఠీతో సృహ కోల్పోయేలా కొట్టారని బాధితుడి పిల్లలు చెబుతున్నారు. తల్లిని, తనను మహిళలు అని కూడా చూడకుండా దూషించారని మీనాక్షి ఆరోపించారు.

రాత్రి అయింది.. ఇంటింకి పంపించమంటే చితకబాదారు

ఇవీ చదవండి :

Last Updated : Apr 29, 2022, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details