తెలంగాణ

telangana

'సికింద్రాబాద్‌' ఘటనలో 8 మంది దుర్మరణం.. కీలక ఆధారాలు సేకరణ..

By

Published : Sep 13, 2022, 7:38 PM IST

Secunderabad Fire Accident update: సికింద్రాబాద్ రూబీ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ-బైక్‌ బ్యాటరీలు పేలడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో జెమోపాయ్ అనే కంపెనీకి చెందిన 40 ఈ-బైకులు సెల్లార్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రమాదవశాత్తు ఒక బ్యాటరీ పేలి.. క్రమంగా మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

'సికింద్రాబాద్‌' ఘటనలో 8 మంది దుర్మరణం.. కీలక ఆధారాలు సేకరణ..
'సికింద్రాబాద్‌' ఘటనలో 8 మంది దుర్మరణం.. కీలక ఆధారాలు సేకరణ..

'సికింద్రాబాద్‌' ఘటనలో 8 మంది దుర్మరణం.. కీలక ఆధారాలు సేకరణ..

Secunderabad Fire Accident update: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడం వల్లే 8 మంది చనిపోయారని అగ్నిమాపక శాఖ అదనపు డీజీ సంజయ్ కుమార్ తెలిపారు. యజమాని సుమీత్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు.. ద్విచక్ర వాహనాల షోరూం, లాడ్జిని సీజ్ చేశారు. సుమీత్‌తో పాటు అతని తండ్రి రాజేందర్ సింగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ఈ-బైకు షోరూమ్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రూబీ ప్రైడ్ భవనానికి నాలుగు అంతస్థులకే జీహెచ్‌ఎంసీ అనుమతి ఉందని.. కానీ అదనంగా మరో అంతస్థు నిర్మించినట్లు గుర్తించామన్నారు. సెల్లార్‌లో కేవలం పార్కింగ్ మాత్రమే చేయడానికి అనుమతి ఉండగా.. విద్యుత్ వాహనాల విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. భవనాలు 18 మీటర్ల ఎత్తు దాటితేనే అగ్నిమాపకశాఖ అనుమతి అవసరమని.. అంతకంటే తక్కువ ఎత్తులో నిర్మించే భవనాలను జీహెచ్‌ఎంసీ పర్యవేక్షిస్తుందని.. సంజయ్ కుమార్ వివరించారు.

ప్రమాదానికి అదే కారణం..!: లాడ్జ్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ వాహనాల షోరూంలో బ్యాటరీలు ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్నిప్రమాద స్థలిలో ఎలక్ట్రిక్ వాహనాలు, సిలిండర్లను పరిశీలించిన క్లూస్ టీమ్స్.. కీలక ఆధారాలను సేకరించింది. సిలిండర్లు పేలి ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేదని తెలిపిన పోలీసులు.. ఘటనపై ఆరా తీస్తున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు..: ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అన్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని మరోసారి పరిశీలించిన హోం మంత్రి మహమూద్ అలీ.. దుర్ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం..

'నొయిడా ట్విన్​ టవర్స్​ తరహాలో కూల్చేస్తాం'.. వారికి మంత్రి వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details