తెలంగాణ

telangana

చైనీస్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

By

Published : Aug 25, 2021, 8:07 PM IST

Updated : Aug 25, 2021, 8:31 PM IST

ed
ed

16:43 August 25

చైనీస్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

 చైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు విచారణలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో భాగంగా భారీగా  హవాలా లావాదేవీలు  వెలుగులోకి వచ్చాయి. చైనీస్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వహణలో రూ.16 కోట్ల హవాలా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.  

 హవాలా లావాదేవీల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో 8 చోట్ల దాడులు నిర్వహించినట్లు ఈడీ కార్యాలయం ప్రకటించింది.  కేశ వ్యాపారులు, ఎగుమతిదారుల కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు  ఈడీ ప్రకటించింది. కేశ వ్యాపారుల ద్వారా రూ.16 కోట్ల హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సోదాల్లో 12 చరవాణులు, 3 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌, డైరీలు, ఖాతా పుస్తకాలు, సమాచారం చేరవేస్తున్న దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.  లెక్కల్లో చూపని రూ.2.90 కోట్లు స్వాధీనం చేసుకున్న తెలిపింది.  ఏపీ, తెలంగాణ కేంద్రంగా కేశ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఫెమా కింద విచారణ  జరుగుతోందని.. ఈడీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 

Last Updated :Aug 25, 2021, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details