తెలంగాణ

telangana

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.54 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

By

Published : May 6, 2022, 8:59 PM IST

Updated : May 7, 2022, 1:18 PM IST

Drugs worth Rs 54 crore seized at Shamshabad airport
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ పట్టివేత

20:58 May 06

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఐదుగురు మహిళల హ్యాండ్ బ్యాగులలో 6.75 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జోహన్నెస్ బర్గ్ నుంచి ఓ మహిళా ప్యాజింజర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అమె అనుమానాస్పదంగా కనిపించడంతో ఎయిర్ ఇంజిలిజెన్స్ యూనిట్, హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఆమెను లగేజిను తనిఖీ చేశారు. అమెతో పాటు మరో నలుగురు ధరించిన హ్యాండ్ బ్యాగులను తనఖీ చేయగా.... రెండు ఫైల్ పోల్డర్లు లభ్యమయ్యాయి. వాటిని తెరచి చూడగా నలుపు రంగు ప్లాస్టిక్ ప్యాకెట్లు దొరికాయి. హ్యాండ్ బ్యాగుల లేయర్లను తనఖీ చేయగా..మొత్తం 6.75 కేజిల హెరాయిన్ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 54కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : May 7, 2022, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details