తెలంగాణ

telangana

అనుమానాస్పద స్థితిలో నవ దంపతుల మృతి!

By

Published : Feb 12, 2021, 12:35 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా పాకాలలో నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పాకాలలోని భారతంమిట్టకు చెందిన అల్తాఫ్‌ హుస్సేన్‌, సమియా.. ఇంట్లోని బాత్​రూమ్​లో నిర్జీవంగా పడిఉన్నారు. సహోద్యోగులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

couple-suspicious-death-at-pakala-in-chittoor-district
అనుమానాస్పద స్థితిలో నవ దంపతుల మృతి!

ఏపీలోని చిత్తూరు జిల్లా పాకాలలో నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పాకాలలోని భారతంమిట్టకు చెందిన అల్తాఫ్‌ హుస్సేన్‌, సమియా.. ఇంట్లోని స్నానాల గదిలో చనిపోయి ఉన్నారు. సమియా కే. వడ్డేపల్లి గ్రామ సచివాలయంలో పోలీస్​గా విధులు నిర్వహించగా.. హుస్సేన్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్​గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతని భార్య ఎన్నికల విధులకు రానందున సహోద్యోగులు ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీశారు. భార్యాభర్తలిద్దరూ బయటకు రాకపోవడం వల్ల అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తహసీల్దార్, కుటుంబ సభ్యులు ముందు బాత్​రూం తలుపులను బద్దలు కొట్టారు. భార్యాభర్తలిద్దరూ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఎలెక్ట్రిక్ సాకెట్స్ ఉండటంతో.. విద్యుదాఘాతమా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details