తెలంగాణ

telangana

ఆస్తి అమ్మకంలో వివాదం: తండ్రిని చంపిన తనయుడు

By

Published : May 23, 2021, 8:59 AM IST

రాక్షస విలువలతో మానవ ధర్మం మంటగులుస్తోంది. ఆస్తి కోసం కన్నవారినీ హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆస్తుల ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చిన్నబోతున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కండాపురంలో ఓ కుమారుడు తన తండ్రిని చంపి శవాన్ని మాయం చేశాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో మృతదేహం ఆచూకీ లభించింది.

son killed father, ap crime news
తండ్రిని చంపిన కుమారుడు, ఏపీ హత్య కేసు

ఆస్తి అమ్మకం విషయంలో తండ్రి-కుమారుల మధ్య జరిగిన గొడవ చంపుకునే వరకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజ‌ర్ల మండ‌లం కండాపురం గ్రామానికి చెందిన గోళ్ల శ్రీ‌నివాసులుకు అత‌ని కుమారుడు కోటేశ్వ‌రావుకు ఆస్తి అమ్మ‌కం విష‌యంలో వివాదం జ‌రిగింది. కోపోద్రిక్తుడైన కుమారుడు క‌త్తితో తండ్రిని దారుణంగా న‌రికి చంపాడు. ఎవ్వ‌రికీ తెలియ‌కుండా శ‌వాన్ని గోప్యంగా పూడ్చిపెట్టాడు.

కోటేశ్వరరావు త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొద‌ల‌కూరు సీఐ గంగాధ‌రావు చేజ‌ర్ల త‌హ‌సీల్దార్ శ్యాంసుంద‌రాజు స‌మ‌క్షంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వ‌హించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:తెల్లవారితే పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి!

ABOUT THE AUTHOR

...view details