తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ కవిత పేరుతో మోసం... రూ.6.50 లక్షలకు టోపీ

By

Published : Apr 6, 2021, 10:39 PM IST

ఎమ్మెల్సీ కవిత పేరుతో డబుల్ బెడ్రూం ఇల్లు, టీవీ ఛానెల్​కు ఛైర్మన్​ను చేస్తామని నమ్మించి రూ.6.50 కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లా జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Cheating in the name of the Mlc kavitha
కవిత పేరుతో మోసం

ఎమ్మెల్సీ కవిత పేరుతో రెండు పడక గదుల ఇళ్లు, టీవీ ఛానెల్​కు ఛైర్మన్​ చేస్తామంటూ రూ.6.50 లక్షలు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లాకు చెందిన మహేశ్​గౌడ్, కామారెడ్డి మండలానికి చెందిన వినోద్.. దుబాయ్​లో ఉండే మహమ్మద్​కు ఫోన్ చేసి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని చెప్పారు.

కవిత పేరు వాడుకుని...

ఎమ్మెల్సీ కవిత రెండు పడక గదుల ఇల్లు ఇవ్వమని చెప్పిందంటూ నమ్మబలికి రూ.6లక్షలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి రెండు తాళాలు ఇచ్చి వాటిపై 2బీహెచ్​కే అనే అక్షరాలు ముద్ర వేయించి బాధితుడి చేతిలో పెట్టారు. రెండు వాకీటాకీలు సైతం ఇచ్చి కవితతో నేరుగా మాట్లాడొచ్చని నమ్మించారు. వీటితోపాటు కవిత ఓ ఛానెల్ పెట్టబోతోందని.. దానికి ఛైర్మన్​గా నిన్నే చేయమని చెప్పిందంటూ మరో రూ.50వేలు కాజేశారు. ఇందుకు కవిత ఫొటో ఉన్న ఓ ధ్రువపత్రం, ఐడీ కార్డు, లోగో సైతం చేతిలో పెట్టారు.

కొన్నాళ్లు గడిచాక ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితుడు కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ కవిత పేరుతో మోసం

ఇదీ చదవండి: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు.. చికిత్స కోసం అప్పులపాలు!

ABOUT THE AUTHOR

...view details