తెలంగాణ

telangana

ప్రియురాలిని హత్య చేశానని పోలీసులకు ప్రియుడు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..!

By

Published : Dec 5, 2022, 4:50 PM IST

Lover Played Murder Drama: ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైందన్న ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రియురాలు హత్యకు గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అది నిజమని నమ్మిన పోలీసులు ఆదివారం రాత్రి అనుమానం ఉన్న ప్రతి చోట గాలించారు. చివరికి పోలీసులు ప్రియుడ్ని విచారించగా ఆమె బతికే ఉందని తేలింది. ఇంతకి ఏం జరిగిందంటే..

Lover Played Murder Drama
Lover Played Murder Drama

Lover Played Murder Drama: పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన పాపారావు, శారదలు ప్రేమించుకున్నారు. ప్రియురాలు శారద పెళ్లి చేసుకోమని అతని మీద ఒత్తిడి తీసుకువచ్చేది. ఎప్పటిలాగానే ఆదివారం కూడా అడగటంతో వారిద్దరీ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అమె అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది. అంతలోనే తన ప్రియురాలు హత్యకు గురైందని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య చేసి సమీపంలో సుబాబుల్​ తోటలో పడేశానని పోలీసులకు తెలిపాడు.

నర్సరావుపేట నుంచి రొంపిచర్ల మధ్య సుబాబుల్ తోటలున్నాయి. ఈ తోటల దగ్గర ఒక అబ్బాయి పాపారావు, అదేవిధంగా ఒక అమ్మాయి శారద అనే పాప. వీరు ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్లు సుబాబుల్ తోటలో ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి పట్టాలు అవి తీసుకొని వాళ్లను బెదిరిచ్చారని చెప్పాడు. కాసేపటి తరువాత మరలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొమని, బలవంతం చేస్తుంటే ఆ అమ్మాయిని చంపేశానని, అతను రకరకాలుగా అతను చెప్పండం జరిగింది. దాని మీద రాత్రంతా కూడా మా డీఎస్పీ ఆధ్వర్యంలో మా టీమ్ అంతా కూడా ఆ సుబాబుల్ తోట మొత్తం చెక్ చేయడం జరిగింది. తీరా చూస్తే ఈ రోజు ఆ అమ్మాయి మా అక్క వాళ్ల ఇంటి దగ్గర ఉన్నానని చెప్పడం జరిగింది. ఇద్దరిని విచారిస్తే వారు ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్లకి పెళ్లి విషయంలో మనస్పర్థలు వచ్చినట్టు, రాత్రి కూడా వాళ్ల దగ్గర ఈ విషయం గురించి గొడవలు జరిగాయి.-భక్తవత్సల రెడ్డి, నర్సరావుపేట సీఐ

పోలీసులు రాత్రాంతా సుబాబుల్​ తోటలో గాలించారు. చివరకు అతని మీదే అనుమానంతో, పోలీసులు అతనిని విచారించారు. మొదట కిడ్నాప్​న​కు గురైందని నాటకమాడాడు. ఆ తరువాత తన ప్రియురాలు బతికే ఉందని తెలిపాడు. ప్రియురాలు బంధువుల ఇంట్లో ఉందని పోలీసుల విచారణలో తేలింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి గల ఉద్దేశం ఏంటనేది తెలియరాలేదు. ప్రియురాలిని విచారించిన తరువాత పూర్తి విషయం బయటకు వస్తుందని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రియుడు, ప్రియురాలు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.

ప్రియురాలిని హత్య చేశాను.. ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details