తెలంగాణ

telangana

FIRE: బైక్​లో ఆకస్మాత్తుగా మంటలు... అప్రమత్తమైన వాహనదారుడు

By

Published : Jun 29, 2021, 5:24 PM IST

Updated : Jun 29, 2021, 6:19 PM IST

ద్విచక్రవాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనదారుడు వెంటనే అప్రమత్తమై కిందకు దిగి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని బండ్లగూడ చౌరస్తాలోని పెట్రోల్ బంక్​ వద్ద జరిగింది.

బైక్​లో ఆకస్మాత్తుగా మంటలు
బైక్​లో ఆకస్మాత్తుగా మంటలు

ఓ ద్విచక్రవాహనంలో ఊహించని విధంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా బైక్​లో మంటలు రావడంతో వాహనదారుడు వెంటనే అప్రమత్తమై ఆర్పేందుకు యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని బండ్లగూడ చౌరస్తాలోని పెట్రోల్ బంక్​ వద్ద జరిగింది.

బైక్​లో ఆకస్మాత్తుగా మంటలు

ప్రమాదం జరిగిందిలా..

హైదరాబాద్​కు చెందిన వెంకటేశ్ కాచిగూడ నుంచి గండిపేట్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతను ప్రయాణిస్తున్న సమయంలో పెట్రోల్ పైపు లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే పక్కనే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ద్విచక్రవాహనం సగానికి పైగా మంటల్లో కాలిపోయింది.

ఇదీ చూడండి:Viral : నిందితుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ దృశ్యాలు

Last Updated : Jun 29, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details