తెలంగాణ

telangana

chintal bike accident: వంద కిలోమీటర్ల వేగం.. రెప్ప పాటులో ఘోరం

By

Published : Nov 25, 2021, 3:31 PM IST

Updated : Nov 25, 2021, 4:30 PM IST

మేడ్చల్ జిల్లా చింతల్‌లో అతివేగం కారణంగా ద్విచక్రవాహనం ఫుట్‌పాత్‌కు ఢీకొని బోల్తాపడింది (chintal bike accident). ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

medchal accident
medchal accident

chintal bike accident: ద్విచక్రవాహనం ఫుట్​పాత్​ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా (one died at chintal accident).. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా చింతల్​ వద్ద జరిగింది.మేడ్చల్ జిల్లా సూరారం ప్రాంతానికి చెందిన అబ్బాస్, బహదుర్పల్లికి చెందిన సాయికిరణ్ స్నేహితులు. బుధవారం రాత్రి వారిద్దరూ కలిసి మద్యం సేవించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ద్విచక్రవాహనంపై సూరారం నుంచి బాలనగర్​వైపు బయలుదేరారు.

సుమారు వంద కిలోమీటర్ల వేగంతో చింతల్‌ వద్ద... ఓ కారును ఓవర్‌టెక్‌ చేస్తుండగా.. ఫుట్‌పాత్‌ను ఢీకొని బైక్‌ బోల్తాపడింది. అబ్బాస్ అక్కడికక్కడే చనిపోగా..... సాయికిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనం వేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

వంద కిలోమీటర్ల వేగం.. రెప్ప పాటులో ఘోరం
Last Updated : Nov 25, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details