తెలంగాణ

telangana

చిన్నారిపై అత్యాచారం కేసు.. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు

By

Published : Oct 19, 2022, 12:58 PM IST

ACP On Banjarahills Girl Rape Case: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని ఏసీపీ సుదర్శన్ తెలిపారు. బాధిత బాలికను భరోసా కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు.

ACP On Banjarahills Girl Rape Case
ACP On Banjarahills Girl Rape Case

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశాం: సుదర్శన్

ACP On Banjarahills Girl Rape Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పాఠశాలలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. పాఠశాలలో ఘటన జరగడంతో ప్రిన్సిపల్‌పైనా కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై ఆ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న రంజిత్‌ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. బాలికను భరోసా కేంద్రానికి పంపించినట్లు పేర్కొన్నారు. పాఠశాలకు వెళ్లి నిందితుడు రంజిత్‌ను అరెస్ట్​ చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. నేరం రుజువైతే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు మరణ శిక్షపడే అవకాశం ఉంటుందని ఏసీపీ సుదర్శన్ చెప్పారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్ ఆవరణలో బాధిత బాలిక కుటుంబసభ్యులు ఆందోళన చేప్టటారు. నిందితుడిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.

"నాలుగు సంవత్సరాల చిన్నారిపై ప్రిన్సిపల్‌కు డ్రైవర్​గా పనిచేసే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చింది. మా సిబ్బంది వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను భరోసా కేంద్రానికి పంపించాం. నిందితుడిపై అత్యాచారం, పోక్సో కింద కేసు నమోదు చేశాం. పాఠశాల ప్రిన్సిపల్‌పైనా కేసు నమోదు చేశాం. నేరం రుజువైతే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణ శిక్ష పడొచ్చు. పాఠశాల యజమాన్యంపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. -ఏసీపీ సుదర్శన్ బంజారాహిల్స్

అసలేం జరిగిదంటే:బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి ఎల్‌కేజీ చదువుతోంది. కొన్నాళ్లుగా నీరసంగా ఉంటున్న బాలిక సోమవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక ఏడుస్తుండటంతో తల్లి బిడ్డను ఎత్తుకొని ఆరా తీసింది. పాఠశాల ప్రిన్సిపల్‌ వద్ద పదేళ్లకు పైగా డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు, రెండు నెలలుగా ఇదే తరహాలో ఇబ్బంది పెడుతున్నట్లు తెలుసుకున్నారు.

మంగళవారం నేరుగా తమ స్నేహితులు, బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడే ఉన్న డ్రైవర్‌ని చితకబాదారు. ఒక దశలో పాఠశాల ప్రిన్సిపల్‌పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. సిబ్బంది సర్దిచెప్పడంతో శాంతించారు. డిజిటల్‌ క్లాస్‌రూంలో పిల్లలతో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నా.. దృష్టి పెట్టలేదని ప్రిన్సిపల్‌పై మండిపడ్డారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఎస్సైలు అంబిక, మనోజ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని డ్రైవర్‌ రజనీకుమార్‌ను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ప్రిన్సిపల్​ డ్రైవర్​ను చితక్కొట్టిన తల్లిదండ్రులు

పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం.. కిరాతకంగా చంపి.. కృష్ణానదిలో పడేసి..

ABOUT THE AUTHOR

...view details