తెలంగాణ

telangana

Road accident today: ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు మృతి

By

Published : Dec 20, 2021, 6:43 PM IST

accident at edlapadu: పని నిమిత్తం పొరుగూరికి వెళ్తున్న కూలీల ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఏపీలోని గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద జాతీయరహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

road accident at edlapadu
యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం

accident at edlapadu: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఇద్దరు మృతి చెందారు. ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. మృతులు బేగం, దరియాబిగా గుర్తించారు.

Road accident today: ఆటోలో 14 మంది కూలీలు పొలం పనులకు చిలకలూరిపేట నుంచి తుమ్మలపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: CM Jagan Kurnool Tour: ఈనెల 22న కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details