తెలంగాణ

telangana

ఎంబీబీఎస్​ విద్యార్థినిపై యువకుడు బ్లేడుతో దాడి

By

Published : Dec 5, 2022, 10:55 PM IST

youngstar Attack with Surgical Blade on Mbbs Student: ఏపీలోని గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్​ విద్యార్థినిపై సర్జికల్‌ బ్లేడుతో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు. దాడిలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేశాక అదే బ్లేడుతో యువకుడు కూడా తన చేయిని కోసుకున్నాడు. విద్యార్థిని మృతదేహం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

youngstar Attack with Surgical Blade
youngstar Attack with Surgical Blade

youngstar Attack with Surgical Blade on Mbbs Student: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్​ విద్యార్థినిపై సర్జికల్‌ బ్లేడుతో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు. దాడిలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేశాక అదే బ్లేడుతో జ్ఞానేశ్వర్ తన చేయిని కూడా కోసుకున్నాడు.

జ్ఞానేశ్వర్‌ను పట్టుకుని పెదకాకాని పోలీసులకు స్థానికులు అప్పగించారు. నిందితుడు జ్ఞానేశ్వర్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థిని మృతదేహం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. యువతి స్వస్థలం, మిగతా విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఎంబీబీఎస్​ విద్యార్థినిపై యువకుడు బ్లేడుతో దాడి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details