తెలంగాణ

telangana

భర్త చేసిన పనికి భార్య బలవన్మరణం

By

Published : Aug 22, 2022, 10:35 PM IST

Women Committed Suicide in AP చిట్టీల వ్యాపారం నడిపి డబ్బులతో పరారయ్యాడు ఓ భర్త. చిట్టి కట్టిన బాధితులు ఇంటి మీదకు వచ్చి నిరసన చేపట్టారు. దీనిని అవమానంగా భావించిందేమో అతని భార్య. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.

Women Committed Suicide
సూసైడ్

Women Committed Suicide in AP: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో వెంకటేశ్వరరావు చిట్టీ వ్యాపారం నడిపించేవాడు. అతని భార్య లక్ష్మి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావు గ్రామస్తుల నుంచి చిట్టీల రూపంలో రూ.50 కోట్లు వసూలు చేశాడు. అలా వసూలు చేసిన నగదుతో గత ఏడాది పరారయ్యాడు.

పరారైన వెంకటేశ్వరరావు గత నెల గ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావుకు నగదు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. గత కొంత కాలంగా బాధితులు, వెంకటేశ్వరరావు ల మధ్య తీవ్ర వివాదం చెలరేగుతోంది. కొన్ని రోజల క్రితం బాధితులు వెంకటేశ్వరరావు ఇంటిపై దాడి చేసి అతని కుమారుడు శ్రీనివాసరావుని అపహరించారు.

తమకు డబ్బులు ఇస్తేనే కుమారుడిని వదిలిపెడతామని.. బెదిరించడంతో వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. ఇలా వరుస ఘటనల నేపధ్యంలో వెంకటేశ్వరరావు భార్య సమీప నివాసంలో ఉన్న బావిలో శవమై కనిపించింది. డబ్బులు విషయంలో ఇంట్లో తరచు గోడవలు జరుగుతున్నాయని.. చిట్టిల డబ్బులపై తీవ్ర మనస్తాపంతోనే భార్య ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు అంటున్నారు.

ఇవీ చదవండి:అమిత్ షా అబద్ధాలకు బాద్‌షా అంటూ కేటీఆర్ ఫైర్

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతు కోసి, ముఖం ఛిద్రం చేసి హత్య

ABOUT THE AUTHOR

...view details