తెలంగాణ

telangana

Kukatpally Accident : కూకట్​పల్లిలో ఘోరప్రమాదం.. యువకుడిని ఈడ్చుకెళ్లిన వాహనం

By

Published : Jan 9, 2022, 11:37 AM IST

Updated : Jan 9, 2022, 11:55 AM IST

Kukatpally Accident : హైదరాబాద్ కూకట్​పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బైక్​పై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టిన టిప్పర్.. 20 మీటర్ల వరకు అతన్ని ఈడ్చుకెళ్లింది.

Kukatpally Accident, software engineer died
కూకట్​పల్లిలో ఘోరప్రమాదం

Kukatpally Accident : హైదరాబాద్ కూకట్​పల్లిలోని కేపీహెచ్​బీ కాలనీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 1 వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన తర్వాత అతన్ని ఆ టిప్పర్.. దాదాపు 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. టిప్పర్ డ్రైవర్ తప్పించుకునేందుకే వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ప్రమాదానికి కారణమైన వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. మృతుడు జగన్ మోహన్ రెడ్డి సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణ చేపట్టారు.

మృతుడు జగన్ మోహన్ రెడ్డి

ఇదీ చదవండి:LB Nagar Car Accident : కారు బీభత్సం.. రూ.13,350 పెండింగ్ చలాన్లు!

Last Updated : Jan 9, 2022, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details