తెలంగాణ

telangana

Lovers suicide: కలిసి చనిపోవాలనుకున్నారు.. కానీ చున్నీ తెగడంతో..!

By

Published : Apr 2, 2022, 11:01 AM IST

Lovers suicide: వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి ఒక్కటవుదామనుకున్నారు. కానీ కులాలు వేర్వేరు కావడంతో అబ్బాయి తల్లిదండ్రులు మరో అమ్మాయితో వివాహం చేశారు. అయినా ప్రేమించిన అమ్మాయిని అతను మర్చిపోలేకపోయాడు. ఆమె ప్రేమను పొందలేకపోయినా.. కనీసం చావులోనైనా కలిసి ఉందామనుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు. కానీ ప్రియుడు మృతి చెందగా.. అతని ప్రియురాలు మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఇంతకీ ఎలా జరిగిందంటే..!

Lovers suicide
Lovers suicide

Lovers suicide: ప్రేమికులు బలవన్మరణానికి యత్నించగా ప్రియుడు చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. కానీ చున్నీ తెగడంతో ప్రియురాలు మృత్యువు నుంచి బయటపడింది. చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లికి చెందిన మోతకాని అంజమ్మ, సత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నరేశ్‌(26) ఏడాది క్రితం దుబాయి వెళ్లి వచ్చి సిద్దిపేటలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వారిద్దరి కులాలు వేర్వేరు. నరేశ్‌కు ఎనిమిది నెలల క్రితం మరో గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. అప్పటినుంచి సంసారంలో గొడవలు రావడంతో భార్య ఆర్నెల్ల క్రితం తల్లిగారింటికి వెళ్లిపోయింది.

అయితే మార్చి 30న నరేశ్‌, యువతి ఎవరికీ చెప్పకుండా దుస్తులు సర్దుకొని ఇళ్లల్లో నుంచి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు చిన్నకోడూరు ఠాణాలో నరేశ్‌పై ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. శుక్రవారం ఉదయం సికింద్లాపూర్‌ శివారులోని గుట్టపై ఉన్న చెట్టు కొమ్మకు ఇద్దరూ ఒకేసారి చున్నీలతో ఉరేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నరేశ్‌కు ఉరి పడి చనిపోయాడు. మరో చున్నీ కొమ్మ నుంచి తెగిపోవడంతో ఆమె జారి కింద పడింది. అపస్మారక స్థితికి చేరింది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. మృతుడి తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శివానందం కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:Accident: పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details