తెలంగాణ

telangana

ఐడీఏ బొల్లారంలో భార్య, అత్తను హత్య చేసిన అల్లుడు

By

Published : Apr 11, 2021, 8:12 AM IST

Updated : Apr 11, 2021, 12:17 PM IST

భార్య, అత్తను హత్య చేసిన అల్లుడు
భార్య, అత్తను హత్య చేసిన అల్లుడు

07:58 April 11

ఐడీఏ బొల్లారంలో భార్య, అత్తను హత్య చేసిన అల్లుడు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. నర్సింహా అనే వ్యక్తి తన భార్య, అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య... గాంధీనగర్‌ కాలనీలోని తన తల్లి దగ్గర ఉంటోంది. తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చిన భర్త నర్సింహా... భార్య స్వరూపపై దాడి చేశాడు. 

అడ్డువచ్చిన అత్త ఎల్లమ్మపై కత్తితో దాడి చేయగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నర్సింహాను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు.  

ఇదీ చదవండి: ఆస్తి కోసం సొంత అన్నయ్యనే చంపేశాడు..!

Last Updated :Apr 11, 2021, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details