తెలంగాణ

telangana

Suicide: 15 రోజులుగా చెట్టుకు వేలాడిన ప్రేమజంట

By

Published : Jun 10, 2021, 3:37 PM IST

ఇద్దరు ప్రేమికులు అడవి ప్రాంతంలో ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డారు. చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా మారిపోయారు. 15 రోజుల క్రితమే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

suicide love couple at forest, nizamabad crime news
Suicide: 15 రోజులుగా చెట్టుకు వేలాడిన ప్రేమజంట

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సయీద్​పూర్ గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. మోస్రా మండలం తిమ్మాపూర్​కి చెందిన మోహన్​, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంకు చెందిన లక్ష్మిగా గుర్తించారు.

వారిద్దరూ 15 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలు లక్ష్మికి ఆరు నెలల క్రితం మరికొకరితో వివాహం జరిగింది.

గత 15 రోజుల నుంచి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ ఉన్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Suicide: 15 రోజులుగా చెట్టుకు వేలాడిన ప్రేమజంట

ఇదీ చూడండి:Attack: పోలీసునని చెప్తున్నా వినకుండా కానిస్టేబుల్‌పై దాడి

ABOUT THE AUTHOR

...view details