తెలంగాణ

telangana

కర్రలతో వెళుతున్న లారీలో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం.!

By

Published : Jan 31, 2023, 10:50 PM IST

Lorry Caught Fire : ఈ మధ్య కాలంలో వాహనాలు దగ్ధమయ్యే ఘటనలు అనేక చోట్ల చేసుకుంటున్నాయి. స్కూటీలు, బైకులు, కార్లు, లారీలు ఇలా వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. వాహనాల ప్రమాణాలు పెంచుతున్నా.. అగ్ని ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా ఏపీలోని ఎన్టీఆర్​ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది.

larry
లారీలో మంటలు

Lorry Caught Fire : ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం జుజ్జూరు వెళ్లే దారిలో పొన్నవరం స్టేజ్ వద్ద లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటల కారణంగా లారీ డ్రైవర్‌ క్యాబిన్‌ పూర్తిగా దగ్ధమయ్యింది. డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. భారీ కర్రల లోడ్​తో వెళుతున్న లారీ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం జుజ్జూరు వెళ్లే దారిలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాణహాని తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details