తెలంగాణ

telangana

మళ్లీ ఆడపిల్ల పుడుతుందని కడుపులో ఉండగానే చంపేశాడు

By

Published : Nov 22, 2022, 4:55 PM IST

father killed his daughter: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో మానవత్వం మంట కలిపిన ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే భార్యకు అబార్షన్‌ మందులు బలవంతంగా ఇచ్చి గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతికి కారణమయ్యాడు. ఇప్పటికే కూతురు ఉండగా మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన ఆ కర్కశకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

father who killed his daughter
father who killed his daughter

father killed his daughter: స్థానిక హఫీజ్‌బాబా నగర్‌లో చెందిన మహమూద్‌ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ భార్యతో కలిసి నివాసముంటున్నారు. ఈ దంపతులకు 18నెలల కూతురు ఉండగా మళ్లీ అతని భార్య గర్భం దాల్చింది. మళ్లీ ఆడపిల్ల జన్మిస్తుందనే భయంతో కుటుంబ సభ్యులతో కలిసి భార్యకు బలవంతంగా అబార్షన్ మందులు వేయించాడు.

మందుల ప్రభావంతో గర్భిణికి ఈ నెల 15న తీవ్ర రక్తస్రావం జరిగి మృత ఆడ శిశువు తల్లి కడుపు నుంచి బయటకు రాగా ఖననం చేశారు. అనారోగ్యానికి గురైన తల్లి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. సంతోష్​నగర్‌లోని స్మశానవాటికలో ఖననం చేసిన మృత శిశువు దేహాన్ని బయటకు తీసి అక్కడే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details