తెలంగాణ

telangana

నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..

By

Published : Jun 26, 2021, 11:06 AM IST

Updated : Jun 26, 2021, 1:08 PM IST

ఇద్దరు మిత్రులు పునుగులు తింటుండగా.. అక్కడి వచ్చిన ఓ పదేళ్ల బాలుడికి వారు ఓ పునుగు ఇచ్చాడు. నేనేమైనా అడుక్కునే వాడినా అంటూ పదేళ్ల బాలుడు వారితో గొడవకు దిగాడు. కత్తి తీసుకుని వచ్చి ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని పొడిచి .. అక్కణ్నుంచి పారిపోయాడు.

Punugula clash, Punugula controversy, Punugula lolli in AP
పునుగుల గొడవ, పునుగుల వివాదం, ఏపీలో పునుగుల లొల్లి

ఏపీలో తెనాలి పట్టణంలోని ఉప్పు బజార్​లో ఇద్దరు బాలురి మధ్య వాగ్వాదం కత్తి పోటుకు దారి తీసింది. పునుగుల విషయంలో తలెత్తిన గొడవలో 16 ఏళ్ల బాలుడిని 10 సంవత్సరాల బాలుడు కత్తితో పొడిచి పారిపోయాడు. బాధితుణ్ని స్థానికులు తక్షణమే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..

మెరుగైన చికిత్స కోసం బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడి పరిస్థితి... విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తెనాలి ఒకటో పట్టణ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పునుగుల వద్ద గొడవ..

ఇద్దరు స్నేహితులు పునుగులు తింటుండగా.. వారి వద్దకు పదేళ్ల బాలుడు వెళ్లాడు. వారిలో ఒకరు.. అతనికి ఓ పునుగు ఇవ్వడంతో నేనేమైనా అడుక్కునే వాడినా అంటూ ఆ పదేళ్ల బాలుడు గొడవకు దిగాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల బాలుడు పదేళ్ల బాలుడిని చెంపదెబ్బ కొట్టి అక్కణ్నుంచి పంపించాడు. అక్కడ నుంచి వెళ్లినట్టే వెళ్ళిన పదేళ్ల బాలుడు.. తిరిగి వచ్చి.. తనను కొట్టినతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు.

Last Updated : Jun 26, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details