తెలంగాణ

telangana

అన్నం పెడతానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

By

Published : Jun 2, 2022, 5:03 PM IST

Rape on Minor Girl: మహిళలు, చిన్నారులపై కామాంధుల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి వారికి మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

Rape on Minor Girl: భోజనం పెడతానని తొమ్మిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ 44 ఏళ్ల వ్యక్తి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి ఏడుస్తూ కనిపించడంతో ఆరా తీసిన తల్లిదండ్రులు.. జరిగిన విషయం తెలిసి భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలో నివసించే తొమ్మిదేళ్ల బాలికపై 44 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలిక కుటుంబసభ్యులు ఉపాధి పని నిమిత్తం వెళ్లగా బాలిక ఇంటివద్దనే ఉంది. బాలికను ఒంటరిగా గమనించిన పక్కింట్లో నివసించే రమేష్.. భోజనం పెడతానని చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి నిందితుడు పరారయ్యాడు.

ఘటనతో భయాందోళను గురైన బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి తమ కూతురు ఏడుస్తూ కనిపించడంతో విషయం తెలుసుకుని హుటాహుటిన చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details