తెలంగాణ

telangana

రూ.36 లక్షలతో ఉడాయించిన ఏటీఎం వాహన డ్రైవర్​

By

Published : Feb 20, 2022, 3:12 AM IST

ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసే వాహనంతో పాటు రూ.36 లక్షల నగదుతో ఏటీఎం వాహన డ్రైవర్​ పరారయ్యాడు. అనంతరం ఆ వాహనాన్ని సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వదిలి.. డబ్బులతో ఉడాయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

రూ.36 లక్షలతో ఉడాయించిన ఏటీఎం వాహన డ్రైవర్​
రూ.36 లక్షలతో ఉడాయించిన ఏటీఎం వాహన డ్రైవర్​

ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసే వాహనంతో పాటు రూ.36 లక్షల నగదుతో డ్రైవర్ పరారైన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాయిబాబానగర్​లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా నగర్​లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సాయంత్రం 5 గంటల సమయంలో రైటర్​ సంస్థకు చెందిన వాహనంలో సిబ్బంది వెళ్లారు. రూ.15 లక్షల నగదును యాక్సిస్​ బ్యాంక్​ ఏటీఎంలో నింపేందుకు క్యాషియర్ రంజిత్, గన్​మెన్ రాంబాబు కిందకు దిగారు. ఈ క్రమంలోనే డ్రైవర్ సాగర్ వాహనాన్ని మలుపు కొస్తానని చెప్పి.. అందులో ఉన్న రూ.36 లక్షల నగదుతో పరారయ్యాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్ అటవీ ప్రాంతంలో వాహనాన్ని వదిలి.. డబ్బులతో పరారైనట్లు తెలిపారు. నిందితుడు సాగర్​ కరీంనగర్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడి ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. నర్సాపూర్​ అటవీ ప్రాంతంలో వాహనంతో పాటు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: Fire Accident: పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చిన తోటి విద్యార్థి తుంటరి పని..

ABOUT THE AUTHOR

...view details