తెలంగాణ

telangana

విచిత్ర ఘటన: ఎన్నికలైన రెండేళ్లకు డబ్బుల పంపిణీ!

By

Published : Nov 21, 2020, 7:56 AM IST

Updated : Nov 21, 2020, 9:14 AM IST

రాష్ట్రమంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల వైపు చూస్తుండగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జప్తీవీరప్పగూడెంలోని ఓటర్లకు మాత్రం పంచాయతీ ఎన్నికలైన రెండేళ్లకు ఇంటింటికీ డబ్బులందడం విశేషం. గ్రామంలో 963 ఓట్లుండగా.. ఓటుకు రూ.3,200 చొప్పున నగదు పంపిణీ జరిగింది. దీనిపై కొందరు పోలీసుల వద్దకు వెళ్లగా గ్రామస్థులే పరిష్కరించుకోవాలంటూ పంపేశారు.

విచ్రిత ఘటన: ఎన్నికలైన రెండేళ్లకు డుబ్బులు పంపిణీ!
విచ్రిత ఘటన: ఎన్నికలైన రెండేళ్లకు డుబ్బులు పంపిణీ!

2019 జనవరిలో జరిగిన ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థి ఒకరు తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.30లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలా శ్రీలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచి గ్రామాభివృద్ధి, దేవాలయ నిర్మాణానికి రూ.30లక్షలను ఇద్దరు వ్యక్తుల వద్ద ఉంచారు. గ్రామంలోని పురాతన రామాలయం పక్కనే స్థలం కొని గుడి కట్టాలనుకున్నారు. రెండేళ్లుగా స్థలం ఎంపిక వివాదంతో అది నిలిచిపోయింది.
ఈలోపు విభేదాలు తలెత్తడంతో.. గ్రామాభివృద్ధికి ఇచ్చిన డబ్బులేమయ్యాయంటూ మాటల యుద్ధం మొదలైంది. ఈ తంతుకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఒక పక్షీయులు ఆ సొమ్మును ఓటర్ల సంఖ్యను బట్టి లెక్కించి గురువారం పంచేశారు.

Last Updated : Nov 21, 2020, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details