తెలంగాణ

telangana

'ఒక వ్యక్తి చెబితే 135 కోట్లమంది వినాలా?.. ఇదేనా ప్రజాస్వామ్యం?'

By

Published : Jul 2, 2022, 3:14 PM IST

Updated : Jul 2, 2022, 4:03 PM IST

Yashwant Sinha Comments on Modi: హైదరాబాద్​లోని జలవిహార్​లో తెరాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా పాల్గొన్నారు. తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెరాసకు ధన్యావాదాలు తెలిపారు. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్న సిన్హా.. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా కొనసాగిస్తామని తెలిపారు.

Yashwant Sinha Comments on Modi in Hyderabad meeting
Yashwant Sinha Comments on Modi in Hyderabad meeting

'ఒక వ్యక్తి చెబితే 135 కోట్లమంది వినాలా?.. ఇదేనా ప్రజాస్వామ్యం?'

Yashwant Sinha Comments on Modi: దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​సిన్హా తెలిపారు. హైదరాబాద్​లోని జలవిహార్​లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న యశ్వంత్​ సిన్హా.. సంపూర్ణ మద్దతిస్తున్నందుకు తెరాసకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశానికి కేసీఆర్‌ వంటి నేత అవసరమని యశ్వంత్‌సిన్హా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చేసే పోరాటం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని.. భారత్‌ భవిష్యత్తు కోసమని వివరించారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని.. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుందన్నారు. కేసీఆర్‌తో మరోసారి సమావేశమవుతామని యశ్వంత్​ సిన్హా తెలిపారు.

"నాకు సంపూర్ణ మద్దతిస్తున్న తెరాసకు.. ప్రత్యేకంగా కేసీఆర్‌, కేటీఆర్‌కు ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్‌ సవివరంగా చెప్పారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు. ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదు. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటమిది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్‌ లోక్‌సభలో గళం విప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారం చేసుకున్నారు. కేసీఆర్‌ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచిది కాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా?.. ఇదేనా ప్రజాస్వామ్యం..?" - యశ్వంత్​ సిన్హా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి

ఇవీ చూడండి:

Last Updated :Jul 2, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details