తెలంగాణ

telangana

'ఇలాగైతే.. సీఎం పర్యటనలకు వాహనాలు సమకూర్చలేం'

By

Published : May 12, 2022, 3:43 PM IST

'ఇలాగైతే.. సీఎం పర్యటనలకు వాహనాలు సమకూర్చలేం'
'ఇలాగైతే.. సీఎం పర్యటనలకు వాహనాలు సమకూర్చలేం' ()

ఏపీ​ రవాణా శాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన ముఖ్యమంత్రి, వీఐపీల కాన్వాయ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరింది. ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని విజ్ఞప్తి చేసింది.

ముఖ్యమంత్రి, వీఐపీల కాన్వాయ్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర రవాణా శాఖ లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించకపోతే.. ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని తేల్చి చెప్పింది. రవాణా మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కాన్వాయ్ వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు. వీఐపీల కాన్వాయ్​ల కోసం ఏటా కనీసం రూ.4.5 కోట్లు అవసరమని లెక్క వేసినట్లు రవాణా అధికారులు తెలిపారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి.. ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో రవాణా శాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details