తెలంగాణ

telangana

Employees Postings: నేడు జోనల్​, బహుళ జోనల్​ అధికారుల బదిలీలు..

By

Published : Jan 8, 2022, 4:43 AM IST

Employees Postings: రాష్ట్రపతి నూతన ఉత్తర్వులుకు అనుగుణంగా కొత్త జోనల్ విధానం కింద చేపట్టిన ఉద్యోగుల బదలాయింపుల ప్రక్రియలో భాగంగా జిల్లా స్థాయుల్లో బదిలీలు, నియామకాలు పూర్తయ్యాయి. జోనల్​, బహుళ జోనల్ ఉద్యోగులు, అధికారుల బదిలీలు, నియామకాలు నేడు పూర్తి చేయనున్నారు.

transfers-of-zonal-and-multiple-zonal-officers-today-in-telangana
transfers-of-zonal-and-multiple-zonal-officers-today-in-telangana

Employees Postings: ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు 2018కి అనుగుణంగా కొత్త జోనల్ విధానం ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగులను ఆయా స్థానికతలకు విభజించారు. జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగుల ప్రక్రియ మొత్తం పూర్తయింది. జిల్లా కేడర్​లో 35 వేలకు పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలు కాకుండా వేరే కొత్త జిల్లాలకు వెళ్లారు. వారందరికీ ఇచ్చిన పోస్టింగుల ఆధారంగా విధుల్లో కూడా చేరారు.

నిర్ణీత గడువులోగా విధుల్లో చేరేందుకు వీలుగా ఉద్యోగులకు రిలీవింగ్​ను కూడా ప్రభుత్వం మినహాయించింది. కొత్త జిల్లాలకు కేటాయించిన వారు నేరుగా వెళ్లి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం పనిచేస్తున్న జోన్, మల్టీజోన్ కాకుండా వేరే చోటుకు కేటాయింపు అయిన వారికి పోస్టింగుల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తవుతుందని ప్రభుత్వం తెలిపింది. వారు సోమవారం లోపు విధుల్లో చేరాల్సి ఉంటుంది. దాంతో విభజన, కేటాయింపుల ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత మిగతా ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details