తెలంగాణ

telangana

బంజారాహిల్స్​లో చీపురు పట్టిన ట్రాఫిక్ పోలీసులు

By

Published : Feb 19, 2021, 11:47 AM IST

ఓ ఇసుక వాహనం అటుగా వెళ్తూ ఉంటే కొంతవరకు ఇసుక రోడ్డు మీద పడిపోయింది. మున్సిపాలిటీ వారితో శుభ్రం చేయించవచ్చు కానీ అప్పటివరకు ఆగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన ట్రాఫిక్ పోలీసులు.. చీపుర్లు అందుకున్నారు. శుభ్రం చేసి పలువురిని ఆశ్చర్యానికి గురి చేశారు.

traffic police cleaning the road at banjara hills in hyderabad
బంజారాహిల్స్​లో చీపురు పట్టిన ట్రాఫిక్ పోలీసులు

నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 రహదారిపై అటుగా వెళ్తున్న వాహనం నుంచి ఇసుక పడిపోయింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు.. నిమిషం ఆలస్యం చేయకుండా చీపుర్లను పట్టుకున్నారు. రోడ్డును శుభ్రం చేసి ప్రమాదాలు జరగకుండా అడ్డుకున్నారు.

ట్రాఫిక్ పోలీసుల ముందుచూపును పలువురు అభినందించారు. ట్రాఫిక్​ను నియంత్రించడమే కాకుండా.. ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యతనూ సరైన సమయంలో తీసుకున్నారని స్థానికులు ప్రశంసించారు.

ఇదీ చూడండి:ఆటోను తప్పించబోయి బస్సు కిందపడి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details