తెలంగాణ

telangana

అంబేడ్కర్​ జయంతి సందర్భంగా నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

By

Published : Apr 13, 2021, 9:48 PM IST

డాక్టర్​ అంబేడ్కర్​ 130 జయంతి సందర్భంగా హైదరాబాద్​లో నిర్వహించనున్న వేడుకల దృష్ట్యా... ట్యాంక్​బండ్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు కానున్న ఈ ఆంక్షలు... వేడుకలు ముగిసే వరకు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

Traffic Diversions Regarding Ambedkar birth anniversary celebrations
Traffic Diversions Regarding Ambedkar birth anniversary celebrations

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అప్పర్ ట్యాంక్​బండ్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వైపు వెళ్లకుండా... తెలుగుతల్లి పైవంతెన వైపు వెళ్లాలని నగరవాసులకు సూచించారు. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు బషీర్​బాగ్ వైపు, బషీర్బాగ్​ నుంచి వచ్చే వాహనాలు హిమాయత్​నగర్ వైపు మళ్లించనున్నారు.

కట్టమైసమ్మ గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు తెలగుతల్లి పైవంతెన మీదుగా మళ్లించనున్నారు. అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను ప్రత్యామ్నాయ రహదారుల గుండా పోనిస్తారు. జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారి లారీ, ట్రక్కుల పార్కింగ్ కోసం బుద్ద భవన్ వెనుక... కార్లు, ద్విచక్రవాహనాలను నిజాం కాలేజి మైదానంలో పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. ఈ అంక్షలు రేపు ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం ముగిసే వరకూ అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details