తెలంగాణ

telangana

పీవీకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం: ఉత్తమ్

By

Published : Dec 23, 2020, 12:21 PM IST

Updated : Dec 23, 2020, 12:30 PM IST

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్​లోని పీవీ ఘాట్​లో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి తెలిపారు.

uttam
uttam

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్​ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మాజీ మంత్రి గీతారెడ్డి, పొన్నాల, వీహెచ్​తో పాటు పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని ఉత్తమ్ తెలిపారు. పీవీ అమలు చేసిన సంస్కరణల వల్లే దేశం ఆర్థికంగా నిలబడిందని కొనియాడారు.

భూ సంస్కరణలు తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోయేలా దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారు. పీవీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే దేశం ఆర్థికంగా నిలబడింది. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదంతా ఘనంగా నిర్వహిస్తున్నాం: ఉత్తమ్​కుమార్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

పీవీకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం: ఉత్తమ్

ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

Last Updated : Dec 23, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details