తెలంగాణ

telangana

టాప్‌టెన్‌ న్యూస్ @ 11AM

By

Published : Apr 19, 2022, 11:00 AM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news

  • టాలీవుడ్​లో విషాదం..

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా సినీపరిశ్రమకు సేవలందించిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారంగ్(78) తుదిశ్వాస విడిచారు.

  • ప్రపంచంలోనే అధికం

కేంద్ర ప్రభుత్వ విధానాలపై ట్వీట్లతో విరుచుకు పడుతున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఎన్డీఏ అసమర్థ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం చేరుకుందని మండిపడ్డారు.

  • లోన్​ యాప్​ వేధింపులకు బలి

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.... ఇప్పటికీ వాటి ఆగడాలు మాత్రం ఆగటంలేదు. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక హైదరాబాద్‌లో మరో యువకుడు బలయ్యాడు.

  • ప్రియుడి మరణవార్త విని ప్రియురాలి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలో వేర్వేరు చోట్ల ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున పురుగుల మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రియుడి మరణవార్త తెలిసి యువతి బావిలో దూకి చనిపోయింది.

  • మరో 1,247 మందికి పాజిటివ్​

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. మరో 1,247మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్​ కారణంగా కొత్తగా ఒక్కరు మాత్రమే మరణించారు. 928 మంది కోలుకున్నారు.

  • పిల్లలు పుట్టాకే పెళ్లి చేసుకుంటారట!

సహజీవనం మన సంస్కృతి కాదు.. ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి తర్వాతే ఒక్కటి కావాలి.. పిల్లల్ని కనాలి. లేదంటే మహిళపైనే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. కానీ ఆ తెగలో మాత్రం స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయచ్చు.. పిల్లల్ని కనచ్చు.. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు.. నచ్చకపోతే అతడితో విడిపోవచ్చు కూడా! ఇదంతా అక్కడ కామన్‌! ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. శతాబ్దాల నుంచీ ఇదే ఆనవాయితీ కొనసాగుతోందక్కడ.

  • పవార్ ఇంటిపై దాడి కేసు..

ముంబయిలో ఓ గాడిద వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. శరద్​పవార్ ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన సదావర్తే కుటుంబం దీన్ని పెంచుకోవడమే ఇందుకు కారణం. ఈ డాంకీని వీరు శునకం లాంటి పెంపుడు జంతువులా ట్రీట్ చేస్తున్నారు.

  • పరుగులు పెట్టించిన ఏనుగు

ఓ పర్యాటకుడిని ఏనుగు ఉరుకులు పెట్టించిన ఘటన.. కర్ణాటకలోని బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో జరిగింది. చామరాజ్‌నగర్‌ మద్దూరు మండలం బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో.. ఓ పర్యటకుడు మూత్ర విసర్జన కోసం కారుని ఆపాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గజరాజు.. అతడితో పాటు కారులో ఉన్న వారిపైన దాడికి యత్నించింది. దీంతో పర్యటకుడు దాని నుంచి తప్పించుకుని కారు వద్దకు వచ్చి అక్కడి నుంచి పారిపోయాడు.

  • ఓటీటీలో రిలీజ్​ అయ్యే చిత్రాలివే!

బాక్సాఫీస్ ముందు పాన్​ ఇండియా సినిమాలు రెండు వారాల వ్యవధిలో ఒక్కొక్కటిగా విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ గ్యాప్​లో కొన్ని సినిమాలు రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమవ్వగా.. మరి కొన్ని వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం రానున్న చిన్న చిత్రాలేంటో చూద్దాం..

  • 'పురుషుల దుస్తులే అమ్మాయిలకూ'

టీమ్​ఇండియా మహిళల క్రికెట్​ గురించి షాకింగ్​ విషయాలను వెల్లడించాడు బీసీసీఐ పరిపాలన కమిటీ మాజీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌. పురుషుల యూనిఫాం కత్తిరించి అమ్మాయిల కోసం మళ్లీ కుట్టిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details